Homeఆంధ్రప్రదేశ్హరహర మహాదేవ శంభోశంకరశివనామ స్పరణంతో మారుమోగుతున్న నల్లమల కొండలుశ్రీగిరికి పాదయాత్ర ద్వారా తరలి వెళుతున్న భక్తులు

హరహర మహాదేవ శంభోశంకరశివనామ స్పరణంతో మారుమోగుతున్న నల్లమల కొండలుశ్రీగిరికి పాదయాత్ర ద్వారా తరలి వెళుతున్న భక్తులు

- Advertisement -


విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు / శ్రీశైలం :హరహర మహాదేవ శంభోశంకర అనే శివనామస్పరణంతో నల్లమల మరోమోగుతుంది . మహశివరాత్రి పురష్కరించుకుని శ్రీగిరికి శివస్వాములు, భక్తులు పెద్దఎత్తున నల్లమల కొండల గుండ పాదయాద్ర ద్వరా తరలివెళుతున్నారు. దట్టమైన కొండలు, గుట్టల గుండ పులులకు నిలయమైన నల్లమల గుండా శివస్వాములు, భక్తులు నంద్యాల జిల్లా వెంకటాపురం నుండి గోసాయికట్ట ,నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి,భీమునికొలను, కైలాసపర్వతం, హఠకేశ్వరం నుండి శ్రీశైలం చేరుకుంటారు. సుమారు 40 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా రాత్రి బగళ్ళు నడిచి శ్రీశైలం చేరుకుంటున్నారు. దాదాపు ప్రతి ఏడాది సుమారు 4లక్షల మంది పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటారని అధి కారుల అంచనా. భక్తుల సౌకర్యార్థం శివస్వాములకు, భక్తులకు వెంకటాపురం, నాగటూటి, పెద్దచెరువు, కైలాసపర్వతం వద్ద దేవస్థానం వారు, భక్తులు పెద్దఎత్తున భోజనాలు, టిఫిన్, వాటర్‌ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు తోపాటు ఉచిత మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. నల్లమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాగటూటి, పెద్దచెరువు, దామెర్లకుంట వద్ద పారెస్టు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈనెల 6వ తేది ను ండే భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి పెద్దఎత్తున భక్తులు పాదయాత్ర ద్వారా లేదా బస్సులలో వాహనాల ద్వారా వెంకటాపురం చేరుకుని అక్కడి నుండి పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు పాదయాత్రకు తరలిరావడం వలన వెంకటాపురం గ్రామం కిటకిటలాడుతుంది. నల్లమలలో అడవి నుండి శక్తులు హరహరమహాదేవ శంభోశంకర , ఓం నమశ్శివాయ అంటూ భజనలు చేసుకుంటూ శివనామస్పరణ చేసుకుంటూ భక్తులు తరలి వెళుతున్నారు. మంగళవారం పెద్దచెరువు సమీపంలో పెద్దపులి ఫారెస్టు అధికారులకు కానవచ్చినట్లు తెలిసింది. దీంతో భక్తులను పారెస్టు అధికారులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా వెళ్ళవద్దని, దట్టమైన అడవిలోకి పోవద్దని గుంపులు, గుంపులుగా వెళ్ళాలని సూచనలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా పాదయాత్ర చేస్తుండటం వలన భక్తుల శివనామస్పరణ నల్లమల అడవులు దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే శ్రీగిరి (శ్రీశైలం) భక్తులతో నిండిపోంది. మహాశివరాత్రి పర్వదినం ఆదివారం జరగనుండటం భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.గత రెండు రోజుల క్రితం శివస్వాములపై .పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల శివభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు హుటాహుటిన శ్రీశైలం చేరుకుని మహాశివరాత్రి ఏరాట్లు పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని అలయ అధికారులు ఇప్పటికే తాగునీరు, వసతులు,మరుగుడ్లు, చలువ పందిర్లు, భక్తులకు ప్రసాదం,క్యూలైన్ల ఏర్పాట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం పురవీధులు అన్ని భక్తులతో శివస్వాములతో కిక్కిరిసి పోయింది. శివస్వాములు ఇరుముడి సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. భక్తులు మాత్రం పెద్దఎత్తున జాగరణ కోసం శ్రీశైలంకు తరలిపోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు