Monday, March 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఆసుపత్రి రోడ్ల నిర్మాణం పరిశీలన చేసిన హరీష్ బాబు

ప్రభుత్వ ఆసుపత్రి రోడ్ల నిర్మాణం పరిశీలన చేసిన హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ధర్మవరం నియోజకవర్గ, ఎన్డీఏ కార్యాలయం, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి? నీటిని పెడుతున్నారా? లేదా? సకాలంలో పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు వహించాలని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులను కూడా వారు పరిశీలించారు. వార్డుల్లో ఉన్న రోగులను స్వయంగా పరిశీలించి ఆసుపత్రి లో వైద్యులు అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్య చికిత్సలను అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీర్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు