Homeజాతీయంబెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు  రూ.30 లక్షల డిపాజిట్‌ డిమాండ్‌!

బెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు  రూ.30 లక్షల డిపాజిట్‌ డిమాండ్‌!

- Advertisement -

దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.
జీతంలో ఎక్కువ శాతం అద్దెకు వెళ్లిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం సోషల్‌ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతోంది.
తాజాగా సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌లో ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు టెకీల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఆ నెటిజన్‌ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని ఫ్రేజర్‌ టౌన్‌ లో ఉన్న ఓ కొత్త 2దీనఖ ఫ్లాట్‌అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమాని రూ.30 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ కోరినట్లు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో తెగ వైరల్
ఆ ఫ్లాట్‌లో డిజైనర్‌ ఇంటీరియర్స్‌, ప్రీమియం బెడ్‌లు, మాడ్యులర్‌ కిచెన్‌, పవర్‌ బ్యాకప్‌, సెక్యూరిటీ, కార్‌ పార్కింగ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.నెలకు అద్దె కేవలం రూ.20 వేలుగా నిర్ణయించినప్పటికీ, భారీ డిపాజిట్‌ డిమాండ్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
దీనిపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది ఒక పెద్ద స్కామ్‌ అని కామెంట్‌ చేస్తుండగా, మరికొందరు ఈ డబ్బుతోనే సొంత ఇల్లు కొంటే మంచిదంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.మొత్తానికి, ఈ ఘటన బెంగళూరు అద్దె మార్కెట్‌లో జరుగుతున్న అసాధారణ పరిస్థితులను మరోసారి బయటపెట్టిందని నెటిజన్లు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు