ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారనే వార్తలపై సన్నిహిత వర్గాలు స్పందించాయి. 16 శనివారం అమితాబ్ ఆసుపత్రికి వెళ్లిన మాట వాస్తవమేనని అది కేవలం సాధారణ తనిఖీ కోసమేనని స్పష్టంచేశాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారని తెలిపాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని వైద్య వర్గాలు తెలిపాయి. మరోవైపు తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతోన్న అభిమానులను ఉద్దేశించి బిగ్‌బీ తన బ్లాగ్‌లో పోస్ట్ పెట్టారు. క్షేమంగా ఉన్నట్లు తెలిపిన ఆయన ‘ప్రేమ, ప్రార్థనలు… ఇంకా మరెన్నో..’ అని నోట్ పెట్టారు. 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ‘కల్కి 2898’ సీక్వెల్‌తో పాటు ‘సెక్షన్ 84’ అనే కోర్టు రూమ్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు. త్వరలోనే తన పాపులర్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 18తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భవిష్యత్‌లో మరెన్నో వినోదాలు పంచాలని తన అభిమానులు, భారత ప్రజానీకం ఆకాంక్షిస్తున్నారు.
నేను క్షేమంగానే ఉన్నా: అమితాబ్
- Advertisement -
RELATED ARTICLES


