- Advertisement -
విశాలాంధ్ర – ఆగిరిపల్లి : డీఎస్సీ ఫలితాలలో ఈదర గ్రామానికి చెందిన నీలం రవి కిరణ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో 12 వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయ పోస్ట్ కు అర్హత సాధించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA సోషియాలజీ చదివి Med పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఇతను సాధించిన విజయానికి ఎస్ టి యు ఆగిరిపల్లి మండల శాఖ అధ్యక్షులు మక్కే. వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి అంకం. వెంకటేశ్వరావు, సీనియర్ నాయకులు సిహెచ్ వి ఆర్ స్ సురేష్ కుమార్, తాడి నరసింహారావు, వంపుగాని కిషోర్ అభినందనలు తెలియజేశారు.


