విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక చిరుసేవాసమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడియపులంక పంచాయతీ ఆవరణలో చిరు సేవా సమితి అధ్యక్షులు గడ్డం శివ, చిరంజీవి అభిమానులు మధ్య కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా రక్త దానాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గడ్డం శివ మరియు మిత్రబృందాన్ని పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో బీజేపీ ఎంఎల్సి సోము వీర్రాజు, జనసేన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, కడియపులంక పంచాయతీ ప్రెసిడెంట్ మారిశెట్టి పద్మావతి, మార్గాని ఏడుకొండలు, బొరుసు సుబ్రమణ్యం, బోడపాటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు.
- Advertisement -
RELATED ARTICLES


