

. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
విశాలాంధ్ర – పోలవరం : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిందేనని, లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక మండలం గన్నవరంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కందుకూరి స్వర్ణకుమారి, వాసం రాము అధ్యక్షతన జరిగిన నిర్వాసితుల సదస్సులు రామకృష్ణ మాట్లాడారు. ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిర్వాసితుల పునరావాసం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పాలకులకు ప్రాజెక్ట్ నిర్మాణం పై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవటం శోచనీయమన్నారు. ఇప్పటికే విలీన మండలాల ప్రజలను రోడ్డున పడేశారని ఇది ఎంత మాత్రం సహేతకం కాదని ఆయన అన్నారు. ఇకనైనా నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి పునరావాసం పై దృష్టి సారించాలని లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం అని ఆయన హెచ్చరించారు.రాజధాని అమరావతి, ఆతర్వాత ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. నిర్వాసితులకు పుండ్రావాసం కల్పించకుండా ప్రాజెక్టు పూర్తి చేయటం సాధ్యం కాదని ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో పునరాగం కూడా అంతే ముఖ్యమన్నారు. పనులను వేగవంతం చేస్తూనే ముప్పు ప్రాంత ప్రజలకు పుండ్రావాసం కల్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎదురుచూస్తున్నారని సాగునీటి అవసరాలతో పాటు మంచినీటి అవసరాలు పారిశ్రామిక సంవత్సరాలు కూడా తీరుతాయి న్నారు. అటువంటి ప్రాజెక్టు కోసం ముప్పు మండలాల ప్రజలు సర్వం త్యాగం చేస్తే , ఆ త్యాగానికి తగిన ఫలితం ఇవ్వడానికి పాలకులకు చేతులు రాకపోవడం విచారకరమన్నారు. పుట్టిన ఊరు , సారవంతమైన నేలలు, గోదావరి నది సోయగాలు , ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్న గిరిజనులు దళితులు బీసీలు సర్వస్వం కోల్పోయి ఆంధ్ర రాష్ట్ర సస్యశ్యామల కొరకు త్యాగం చేస్తున్నారని వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువేనని ఆయన అన్నారు. లక్ష ఆరువేల మంది నిర్వాసితులు అవుతున్నారని, అందరికీ ప్యాకేజీ వర్తింపకుండా ఉండటం కోసం ఎత్తు కుదింపు సాకుతో మొదటి దశలో 41.15 ఎఫ్ ఆర్ ఎల్ వరకు పునరావస ప్యాకేజీ ఇస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పటం సరికాదన్నారు, ఎత్తు కుదింపు వలన మినీ రిజర్వాయర్ అయ్యే ప్రమాదం ఉందని, ప్రాజెక్టు లక్ష్యము కూడా నెరవేరదని ఆయన అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాస్ కార్యక్రమాలు జరగాలని, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తమ జీవన ఉనికిని ఆస్తులను త్యాగం చేసిన ప్రజలకు ఎంత చేసిన తక్కువే అని వారికి పది లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు ప్రాంతంలో నిర్మిస్తున్న 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదిక కేంద్రంలో అర్హతలు బట్టి నిర్వాసితుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభలో కొత్తగూడెం శాసనసభ్యులు , తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అశాస్త్రీయ సర్వేల వలన లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, ముప్పు మండలాలకు సరైన న్యాయం చేయటం చేతకాకపోతే తెలంగాణ నుండి ముంపు సాకుతో ఏడు మండలాలను ఎందుకు విలీనం చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. చివరి నిర్వాసితుడి వరకు న్యాయం జరగాలని, అందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి చేసే ఉద్యమాలకు ఆందోళనకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యక్షంగా పాల్గొంటుందని, పాలకుల మెడలు వంచన నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వాలను వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలు పరిశీలించడానికి ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నాయని, నిర్వాసితుల ఉసురు తగులుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అమరావతిలో చేపట్టే నిరాహార దీక్షల్లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి తోపాటు తాను కూడా ప్రత్యక్షంగా ఆ ఆందోళనలో పాల్గొంటానని సాంబశివరావు అన్నారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం లో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ముంపు మండలాల నుండి పార్టీ శ్రేణులు వేలాదిక తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సిపిఐ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడిందని, దేశవ్యాప్తంగా సమస్యల పోరాటంలో ఎంతో మంది నాయకులు ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు . త్యాగాల చరిత్ర ఉన్న సిపిఐకి నూరేళ్లు నిండి నూటోక సంవత్సరంలోకి వచ్చిందని, ఇంతటి ఘన చరిత్ర కలిగిన సిపిఐ పార్టీలో మనమందరం ఉండటం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు . కమ్యూనిజం అజరామరమని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం ఎర్రజెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు ఈనెల 18 ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఐదు లక్షల మంది ఎర్రజెండా బిడ్డలు హాజరవుతున్నారని, 40 దేశాల విదేశీ ప్రతినిధులు , రావడం జరుగుతుందని, గతంలో కనివిని ఎరగని విధంగా ఖమ్మం పట్టణం ఎర్ర పూల వనము పూసింది అనే విధంగా సభ జరుగుతుందని, ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జాతి సమితి కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత రావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఎఎస్ఆర్ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, సిపిఐ ఏలూరు జిల్లా నాయకులు ఎండి మునీర్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుకారం ధారయ్య,బాడిస రాము, కొన్ని లక్ష్మయ్య, జంపన వెంకటరమణ రాజు, అయితా సురేష్ బాబు,మైసాక్షి వెంకటాచారీ,కూరాకుల బాబురావు,వరకా శ్యామల, చింతూరు డివిజన్ కార్యదర్శి గుజ్జా మోహన్ రావు, సీనియర్ నాయకులు సూరి చందర్రావు, కూనవరం మండల కార్యదర్శి లంబు శ్రీను, విఆర్ పురంమండల కార్యదర్శి కర్నాటి ఏసు, నాగరాజు, తుర్రం మురళి, వరద బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.


