Homeఆంధ్రప్రదేశ్ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి

ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర–గుడిబండ: మహాత్మా గాంధీ సందేశ పాదయాత్రను పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్న సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మధుగిరి–మడకశిర జాతీయ రహదారిపై వెటర్నరీ కాలేజీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన రఘువీరారెడ్డి తన కాన్వాయ్‌ను వెంటనే ఆపించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారిని ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌లో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటన స్థలంలో కొంతసేపు నిలిచి చికిత్సా చర్యలు ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షించినట్లు సమాచారం. ఆపదలో ఉన్నవారికి రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ మనిషిగా స్పందించిన రఘువీరారెడ్డి చర్యపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజా సేవలో మానవతా దృక్పథం అవసరమని ఆయన మరోసారి నిరూపించారని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు