Homeజిల్లాలువిజయనగరందేవుని పేరుతో రాజకీయమా

దేవుని పేరుతో రాజకీయమా

- Advertisement -

. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
. ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కింది
. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి

విశాలాంధ్ర – విజయనగరం టౌన్ – దేవుని పేరుతో రాజకీయం చేయడం ఆయనకే చెందిందని, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కిందని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూగత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై సాగుతున్న వివాదానికి సిట్ నివేదికతో తెరపడిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిన ఆరోపణలు కేవలం అబద్ధాలేనని నేడు సిట్ ఇచ్చిన నివేదికతో స్పష్టమైందన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగారని విమర్శించారు. రానున్న కాలంలో వైసీపీని భూస్థాపితం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దేవుని విషయంలో ఈ విధంగా చేయడం సరికాదన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలను గౌరవించి అనేక వెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మించడం జరిగిందన్నారు. దీనిని చూడలేని కూటమి ప్రభుత్వం ఇటువంటి దిగజారుడు రాజకీయం చేసిందన్నారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పు చూసి చంద్రబాబు చేసిన పనికి ప్రజలంతా బాధపడుతున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ తరహా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ లో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చడంతో ఇప్పటికైనా భక్తుల ఆందోళన తగ్గిందని, నిజం బయటపడినందుకు సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు చంద్రబాబు భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వి రాజేష్, బండారు బంగారనాయుడు, ఈశ్వర్ కౌశిక్, డోల మన్మధ కుమార్ తదితర విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు