విశాలాంధ్ర-అమడగూరు: మండల పరిధిలోని చీకిరేవులపల్లి గ్రామానికి చెందిన పీట్ల రమేష్, అనిత దంపతుల కుమార్తె ఝాన్సీ (14) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.పోలీసులు, గ్రామస్తులు, తెలిపిన వివరాల మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు గురువారం ఝాన్సీని సరిగా చదవలేదని మందలించడంతో మనస్థాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.శుక్రవారం ఉదయం మృతురాలు విద్యార్థి తల్లిదండ్రులు రమేష్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కి ఉదయం వెళ్లారు. దీంతో ఝాన్సీ తల్లితండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు వారు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.విద్యార్థిని ఝాన్సీ మృతి చెందిన విషయం తెలుసుకున్న అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వెళ్లి నివాళులు అర్పించారు.ఇదిలావుంటే రమేష్ తండ్రి కూడా రెండు నెలలు క్రితం గుండెపోటుతో మృతి చెందారు.
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య..
- Advertisement -
RELATED ARTICLES


