విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు,…ఎన్టీఆర్ ఆశయాలకు పాతర…..
విశాలాంధ్ర :చిలమత్తూరు,…హిందూపురం నియోజకవర్గం గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటుగా నిలిచింది, అలాంటి నియోజకవర్గానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు ఎమ్మెల్యే బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది, అలాంటి ఈ ప్రాంతంలో బాలయ్య ఇలాఖ లో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి, ఈ తతంగం పై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలంటే మద్యం షాపులలో అధికార పార్టీ నేతల నిర్వహణ ఉండడంతో వెనుకడుగు వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం, ఇదే అదునుగా క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో బెల్ట్ షాపులు నిత్యం మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి ప్రతి గ్రామంలో రెండు మూడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు, కూటమి అధికారంలోకి రాగానే టెండర్ల ద్వారా మద్యం షాపులు ఏర్పాటు చేసింది కాకపోతే అధికార పార్టీ నేతలు సిండికేట్ గా ఏర్పడి ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతూ వారి కను సన్నల్లో దుకాణాలు నడిపిస్తుండడంతో ఎక్సైజ్ వారు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఇవి కూడా నాయకుల చేతులలోనే ఉన్నాయి, అనుమతి ఉన్న మద్యం షాపుల నుండి బాటిల్ కొనుగోలు చేసుకుని బెల్ట్ షాపులలో విక్రయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అనుమతి ఉన్న షాపుల్లో బాటిల్ పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ 20 తో అమ్మకాలు జరుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు, ఇక బెల్ట్ షాపులు అయితే ధరలు చెప్పనక్కర్లేదు, అంతేకాక అనుమతులు ఉన్న షాపు తరహాలో ఏర్పాట్లు చేసి బెల్ట్ షాపుల లో విక్రయాలు సాగిస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఇంత జరుగుతున్న ను అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు, ముఖ్యముగా నిబంధన ప్రకారం మద్యం దుకాణాల వద్ద బాటిల్ విక్రయాల మాత్రమే జరగాలి, పర్మిట్లకు అనుమతి ఇస్తేనే అక్కడ కూర్చొని తాగే ఏర్పాటు చేయాలి, కానీ ఇవేమీ లేకపోయినా దుకాణాలు వద్ద సిట్టింగులు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు జరుపుతున్నారు, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు ఈ తతంగంపై పట్టించుకోని పరిస్థితి ఉందని బహిరంగముగా చర్చించుకుంటున్నారు, ఇటీవల మహారాష్ట్ర మద్యం అమ్మకాలు జరిపి కొంత మంది నాయకులు అడ్డంగా బుక్కయ్యారు, అయినప్పటికీ ఈ అంశాలన్నీ ఎమ్మెల్యే బాలయ్య బాబుకు తెలుసో తెలియదో గాని బాహాటముగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మరి చూడాలి ఎమ్మెల్యే బాలయ్య రెండు రోజుల పర్యటనలో ఈ వ్యవహారం పై స్పందిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
బాలయ్య ఇలాఖా లో… బెల్ట్ షాపుల రోత ..
- Advertisement -
RELATED ARTICLES


