ఆలయ అభివృద్ధి కమిటీ
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 11వ 12వ తేదీలలో పవిత్ర ఉత్సవాల వేడుకలు ఆలయ అభివృద్ధి కమిటీ, భక్తాదుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా చివరి రోజు మంగళవారం శ్రీ భూ లీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరణ, సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు సుదర్శన చార్యులు, నాగ నరసింహ, వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూజలు చేశారు. తదుపరి ప్రత్యేక పూజలు, అర్చనలు, పంచామృతాభిషేకాలు, వివిధ రూపాలలో హోమంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎస్ డి హెచ్ ఎస్ వాలంటీర్లు సహాయ సహకారాలను అందించారు. రెండు రోజులు పాటు విజయవంతంగా నిర్వహించినందుకు పేరుపేరునా కమిటీ వారు భక్తాదులకు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెటీకలకుళ్లాయప్ప, సాగా సురేష్, రంగా శ్రీనివాసులు, గుద్దుటి రామాంజనేయులు, దత్త శివ, శంకర సంజీవులు, బిళ్ళే నాగప్ప, ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్లు సుఖానంద, నాగరాజు, పెద్దన్న అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.
ముగిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ఉత్సవాలు..
- Advertisement -
RELATED ARTICLES


