విచారణ కర్త పద్మనాభచార్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠము శాఖలో ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 12వ తేదీ వరకు స్వామివారి 354వ ఆరాధన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని విచారణ కర్త పద్మనాభచార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాల్గవ రోజు మంగళవారం ఇతరారాదన కార్యక్రమంలో భాగంగా విశేష పంచామృత అభిషేకం, కనక మహా పూజ, పల్లకి సేవ, మహా మంగళహారతి తదితర కార్యక్రమంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించామని అర్చకులు నిర్వహించారని తెలిపారు. చివరి రోజున స్వామి వారు చంద్రప్రభ అలంకరణలు భక్తాదులకు దర్శనమిచ్చారు..అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనల తోపాటు వివిధ పూలలతో అలంకరించిన వైనం అందరిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సేవా కార్యకర్తలు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.
ముగిసిన 354వ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


