భారత సైన్యం కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి.తాజాగా, ఇండియాలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన 7 గురు టెర్రరిస్టులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతం చేసింది. శుక్రవారం పాక్ రేంజర్ల సాయంతో 7 గురు టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. అలర్టైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని కాల్చిపడేసింది.
ఆపరేషన్ సిందూర్ కారణంగా 100 మంది దాకా టెర్రరిస్టులు బలయ్యారు. దీంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. భారత్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిన్న 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది. భారత సైన్యం వాటిని ధ్వంసం చేసి పడేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము : అమెరికా
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం మధ్యలో మేము కలుగజేసుకోము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశిస్తున్నాము. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదు. యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలము. మధ్యలో కలుగు జేసుకుని యుద్ధం ఆపమనడం మా పని కాదు అని అన్నారు.