Monday, February 24, 2025
Homeజాతీయం400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్!

400 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్!

2022-23లో క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా 2 వేల మంది ఎంపిక
గత ఏడాది వీరిని విధుల్లోకి తీసుకున్న ఇన్ఫోసిస్

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ భారీ లేఆఫ్ ను చేపట్టింది. కర్ణాటకలోని మైసూరు క్యాంపస్ లో దాదాపు 400 మంది ట్రైనీలకు ఉద్వాసన పలికింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమవడంతో వారిని తొలగించినట్టు సమాచారం.

ఫ్రెషర్ల నియామకం విషయంలో ఇన్ఫోసిస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో, గత ఏడాది ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకుంది. 2024లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై ఇన్ఫోసిస్ వేటు వేసినట్టు సమాచారం. వేటు వేసిన వారిలో 400 మందికి టెర్మినేషన్ లెటర్లు ఇచ్చింది. వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగిస్తున్నారు. ట్రైనీలను బ్యాచ్ ల వారీగా పిలిచి… వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకుంటున్నట్టు జాతీయ మీడియా కథనాలు చెపుతున్నాయి. అయితే, ఈ లేఆఫ్స్ పై ఇన్ఫోసిస్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

ఈ నేపథ్యంలో ఓ ట్రైనీ మాట్లాడుతూ… తాము ఫెయిల్ కావాలనే ఉద్దేశంతోనే ఎవాల్యుయేషన్ పరీక్షలను చాలా కఠినంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అన్యాయమని చెప్పారు.

2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2 వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ తదితర పోస్టులకు వీరిని ఎంపిక చేస్తూ ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వీరంతా 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు. అయితే వీరిని విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఇన్ఫోసిస్ ఆలస్యం చేస్తూ వచ్చింది. దీంతో, ఇన్ఫీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కార్మిక శాఖ వద్ద కూడా ఫిర్యాదు నమోదయింది. ఈ క్రమంలో రెండేళ్లు ఆలస్యంగా 2024 ఏప్రిల్ లో వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరిలో సగం మందిని ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు