చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిధిలోని కును తూరు గ్రామంలో 1000 సంవత్సరాల క్రితం నాటి శాసనాలను గుర్తించడం జరిగిందని చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన దేవాలయాల చారిత్రిక పరిశోధనలో భాగంగా తాను మూడు ప్రాచీన శాసనాలు గుర్తించడం జరిగిందన్నారు. రెండు శాసనాలు కాలభైరవ శివాలయములోనూ, ఒకటి కొల్లాపూర్ అమ్మ గుడిలోనూ గుర్తించడం జరిగిందన్నారు. ఈ శాసనాలు అన్నీ కూడా కన్నడ భాషలో ఉన్నాయని తెలిపారు. ఈ శాసనాలు మైసూర్ లోని భారత పురావస్తు శాఖ కార్యాలయం డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కు పంపడం జరిగిందన్నారు. ఈ శాసనాన్ని క్రీస్తు శకం 12 18 వ సంవత్సరము అక్టోబర్ 22వ తేదీన దేవగిరి యాదవ రాజు రెండవ సింహనుడు రాయించడం జరిగిందన్నాడు. ఈ శాసనంలో కాలభైరవ శివాలయానికి కొన్ని భూములను మాన్యంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శాసనాలు వెయ్యిల క్రితం నిర్మించినట్లు ఖచ్చితమైన ఆధారాలు లభించడం జరిగిందన్నారు. కొనుతూరు గ్రామంలో శాసనాలలో దేవాలయాల గొప్పతనాన్ని చారిత్రిక వైభవాన్ని ప్రజలందరికీ తెలిసేలా దేవాదాయశాఖ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలభైరవ శివాలయములోని శివలింగం అత్యంత మహిమ నిత్వం అయినదని తెలిపారు. బ్రహ్మసూత్రాలు కలిగిన ప్రాచీన శివలింగాలు చాలా అరుదు అని వారు తెలిపారు. ఇప్పటివరకు నా పరిశోధనలో లభ్యమైన ఆధారాల మేరకు పశ్చిమ చాళుక్యులు, హో యాసాలలు, దేవగిరి యాదవులు, విజయనగర రాజ్యపాలకులు, ఇలా వివిధ రాజవంశీయులు ఏలుకొన్న ఈ ప్రాంతం ఉన్నదని తెలిపారు. కావున ఈ కునుతూరు గ్రామాన్ని ఒక చారిత్రక ప్రాముఖ్యత గల గ్రామంగా గుర్తించాలని, ఈ శాసనాలను వెలుగులోకి తెచ్చి చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని త్వరలోనే అందజేస్తానని వారు తెలిపారు.
కునుతూరు గ్రామములో శాసనాలు గుర్తింపు..
- Advertisement -
RELATED ARTICLES


