Thursday, May 29, 2025
Homeఆంధ్రప్రదేశ్యోగ , ఆటలపై ఆసక్తి ఎంతైనా అవసరం..

యోగ , ఆటలపై ఆసక్తి ఎంతైనా అవసరం..

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో యోగ, ఆటలపై ఎంతైనా ఆసక్తి అవసరము అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు యోగ, ఆటల విషయంలో మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగా ఆసనాలు నెల రోజులు శిక్షణ పొందడం మంచి అవకాశం ఉంది తెలిపారు. యోగా వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం కలుగుతుందని తెలిపారు. తదుపరి కుర్చీలాటకు ఎంతో స్పందన రావడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 11 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు