పాఠశాల కరెస్పాండెంట్ నిర్మలాదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ను ధర్మవరం పట్టణంలోని స్థానిక కాకతీయ విద్యా నికేతన్ విద్యార్థులు ఓజోన్ పొరను రక్షించండి మానవాళికి రక్షణగా ఉండండి అనే నినాదం తో సేవ్ ఓజోన్ ఆకారం లో కాకతీయ విద్యార్థులు కూర్చొని ఓజోన్ పొరను పరిరక్షణ చేయాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్లు శెట్టిపి పద్మ , శెట్టిపి సూర్య ప్రకాశ్ రెడ్డి, హర్జిత్ ప్రణవ్ రెడ్డి ,మాట్లాడుతూ ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీల రోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని మానవునితోపాటు సమస్త జీవకోటిని రక్షిస్తుంది అని తెలిపారు. అయితే ఓజోన్ పొర ఫ్రీజ్ లు,ఏసీలు ,స్ప్రే ల ,నుండి వెలబడే క్లోరో ఫ్లోరో కార్బన్లు హేలాన్లు వంటి రసాయనాల వల్ల ఓజోన్ పొర క్షీణిస్తూ వస్తుంది అని, దీనినీ రక్షించవలసిన బాధ్యత ఉంది కనుక మనం పర్యావరణ రహిత పరికరాలను ఉపయోగించడం , ప్లాస్టిక్ రసాయనాల వాడకాన్ని తగ్గించడం వల్ల ఓజోన్ పొర రక్షణలో భాగస్వామ్యలు కావాలని వారి పిలుపునిచ్చారు. కాకతీయ విద్యార్థులు విన్యూత రీతిలో ప్రచారం చేయడం అభినందనీయమని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవ వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


