Homeజిల్లాలుఅనంతపురంషష్టి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ

షష్టి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సహిత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేసి, విద్యుత్‌ అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. షష్టి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు