ఎదురు తిరిగే సామర్థ్యం ఆదేశానికి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యల చేశారు. ఇరాన్‌ను తక్కువ అంచనా వేయరాదని, ఎదురుదాడులు చేసే సామర్థ్యం ఉందని అన్నారు. అమెరికా సైనిక చర్యలతో పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించిందన్నారు. ‘ఇరాన్‌కు ఇంకా సామర్థ్యం ఉంది. అయితే, అదంత ఎక్కువేం కాదు. వారు విజయం సాధించే స్థితిలో ఏం లేరు. కానీ, ఎదురుదాడులు చేయగలరనే అనుకుంటున్నా. హోర్మూజ్‌లోని ఓ నౌకపైకి వారు నాలుగు డ్రోన్లు పంపించారు. అందులో మూడింటిని కూల్చేశాం. ఒకటి మాత్రం నౌకకు తగిలి కొంత మేర ధ్వంసమైంది’ అని ట్రంప్ వెల్లడించారు.
హింసకు దిగితే సహించేది లేదు: వాన్స్
తాజా ఘర్షణలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిందని మేం దాన్ని గౌరవిస్తున్నాం. ఆ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని తప్ప్పుబట్టారు. ఒకవేళ ఒప్పందంలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వారు ఫోన్ చేసి మాట్లాడొచ్చన్నారు. అంతేకానీ ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. హింసకు సమాధానం హింసే అవుతుంది అని వాన్స్ పరోక్షంగా తెహ్రాన్‌ను హెచ్చరించారు.
ఒప్పందంపై అమెరికాకు నిబద్ధత లేదు: ఇరాన్
అమెరికా దాడులను ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ హెడ్ ఇబ్రహీం అజీజీ తీవ్రంగా ఖండించారు. ‘చర్చల మధ్య అమెరికా మరోసారి మాపై దాడి చేసింది. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పట్ల నిబద్ధత లేదని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించుకున్నారు. ఈ నిర్లక్ష్యపు ఉల్లంఘనకు వారు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. ఇలాంటి నిందలు ఇకపై పనిచేయవు’ అని అమెరికాని అజీజీ హెచ్చరించారు.
ఇరాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు
- Advertisement -


