Monday, November 17, 2025
Homeజిల్లాలుఅనంతపురంవరల్డ్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్న జె.సి ప్రభాకర్ రెడ్డి

వరల్డ్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్న జె.సి ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర- తాడిపత్రి: శ్రీ శివ సాయి మందిరం సాయిబాబా విగ్రహానికి వరల్డ్ బుక్ రికార్డు సర్టిఫికెట్ రావడం గర్వంగా, సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారము పట్టణంలోని సంజీవ్ నగర్ ఐదవ రోడ్డులో వెలసిన శ్రీ శివ సాయి మందిరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్వీ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా విగ్రహం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం దక్కిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డికి అవార్డు ప్రధానం, సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చెందిన అధికారి పవన్ సోలంకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెసి. అస్మిత్ రెడ్డి జెసి. ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ చరిత్ర పుటల్లోకి ఎక్కిన తాడిపత్రి శ్రీ శివసాయి మందిరం, టెంపుల్ సిటీ అఫ్ రాయలసీమ ప్రయత్నానికి తొలి అడుగు అన్నారు. ఏకశిలా సాయిబాబా విగ్రహంగా రాజస్థాన్లోని జైపూర్ నుంచి తాడిపత్రికి 9.5అడుగులు ఎత్తు 7టన్నులు బరువు ఈ సాయి బాబా విగ్రహం యొక్క ప్రత్యేకత అని అన్నారు. అహ్మదాబాద్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చెందిన అధికారి పవన్ సోలంకి తాడిపత్రికి చేరుకుని ఏకశిలనా విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని వెళ్లారని చెప్పారు. అనంతరం రికార్డులు పరిశీలించి భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ఏకశిలా విగ్రహం ఇంత పరిమాణంలో లేదని ధ్రువీకరించారని తెలిపారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తాడిపత్రి ప్రజలు, మహిళలు సైతం పెద్ద ఎత్తున సేవ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను కోరారు. అనంతరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్స్ ను తాడిపత్రి ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి, ఎస్వీ. రవీంద్రరెడ్డిలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సాయిబాబా భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు