Monday, November 17, 2025
Homeజిల్లాలుఅనంతపురంవిలేకరులకు శిక్షణ తరగతులు..ఎపియుడబ్యుజే

విలేకరులకు శిక్షణ తరగతులు..ఎపియుడబ్యుజే

- Advertisement -

విశాలాంధ్ర- రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని జిల్లా గ్రామీణ విలేకరులకు శుక్రవారం నుండి రెండు రోజుల పాటు రాయదుర్గం పట్టణంలో ఎపియుడబ్ల్యూజె మరియు సి. రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆద్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎపియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,షేక్ మహమ్మద్ ఆయుఫ్ తెలిపారు. పట్టణంలోని తృప్తి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వేదిక కానుంది. ఈ శిక్షణా తరగతులను సి.ఆర్. ప్రెస్ అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రారంభింస్తారు. ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు,విశాలాంధ్ర బ్రాంచ్ మేనేజర్ నాగరాజు,కర్నూలు జిల్లా అద్యక్షులు ఇ.ఎన్.రాజు తదితరులు పాల్గొంటారు. రెండవ రోజు ముగింపు సభకు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విఫ్ కాలువ శ్రీనివాసులు హాజరౌతారు. గ్రామీణ విలేకరులు అధిక సంఖ్యలో హాజరై శిక్షణా తరగతులను జయప్రద చేయాలని ఎపియుడబ్ల్యూజె జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,షేక్ మహమ్మద్ ఆయుఫ్ లు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు