రేగాటిపల్లి చెరువుకు పూజ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రేగాటిపల్లి చెరువు మంత్రినివా నీటి ప్రవాహంతో పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల కంమధుసూదన్ రెడ్డి, సతీమణి చిలకం ఛాయాదేవి తో కలిసి చెరువుకు గంగపూజ నిర్వహించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేగాటిపల్లి చెరువు పూర్తి దశలో నిండడం గ్రామ ప్రజలకు ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రామములో ఏర్పాటుచేసిన త్రాగునీటి ప్లాంటు పనులు పూర్తి అయిన నేపథ్యంలో సతీమణి చిరకం ఛాయాదేవితో పాటు వారు ప్లాంటును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రేగాటిపల్లిలో స్వచ్ఛమైన త్రాగునీటి లభించడం శుభదాయకమన్నారు. అనంతరం గ్రామ ప్రజలు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


