విశాలాంధ్ర ధర్మవరం:: రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రతి గ్రామములో నిర్వహించబడే రీ సర్వేలో అందరికీ తప్పక న్యాయం చేకూర్చుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోని గ్రామసభను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, షెడ్యూల్ తేదీల ప్రకారం పరిష్కరించబడుతుందని తెలిపారు. తదుపరి కొంతమంది రైతులు తమ సమస్యలను విన్నవించుకున్నారు
ఏ సమస్య అయినా కూడా సచివాలయంలో ఇవ్వాలని వారు తెలిపారు. తదుపరి తుమ్మల లోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని అన్ని రికార్డులను వారు పరిశీలిస్తూ, ఉద్యోగుల అటెండెన్స్ లను తనిఖీ చేస్తూ సమయపాలనలో తేడా రాకూడదని వారు హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే గ్రామ ప్రజల సమస్యలు సులభతరంగా పరిష్కారం అవుతాయని వారు సూచించారు. విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేష్ బాబు, వీఆర్వో ప్రసాద్ ,గ్రామ సర్వేయర్ వాణి, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రీ సర్వేలో అందరికీ న్యాయం జరుగుతుంది.. ఆర్డీవో మహేష్
RELATED ARTICLES