ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీలలో నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ బృందం పర్యటించడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డా.జె.సదాశివ భట్ ఁన్యాక్ ఛైర్ పర్సన్ఁ,డా.అనిల్ ఓ
ఁకో-ఆర్డినేటర్ఁ,డా.బాబన్ తైవాడే ఁమెంబరుఁగా న్యాక్ బృంద సభ్యులుగా విచ్చేయడం జరిగిందన్నారు. ఎన్.సి.సి కేడేట్ల ఘన స్వాగతంతో కార్యక్రమం మొదలు కాగా, గత ఐదేళ్ళలోని కళాశాల అభివృద్ధిని, విద్యా కార్యకలాపాలను న్యాక్ సభ్యులకు తెలియజేశారు. న్యాక్ ప్రమాణాలతో కళాశాలలో వున్న మౌలిక వసతులు, బోధన, పరిశోధన వంటి అంశాలతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యుయేసి కో-ఆర్డినేటర్ ఏ.కిరణ్ కుమార్, న్యాక్ కో-ఆర్డినేటర్ ఎస్.పావని , ఇతర అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం పర్యటన ..
RELATED ARTICLES