Homeజిల్లాలువిజయనగరంమండల టి డి పి అధ్యక్షుడుగా కర్రోతు సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక

మండల టి డి పి అధ్యక్షుడుగా కర్రోతు సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -

విశాలాంధ్ర- భోగాపురం : (విజయనగరం జిల్లా ) : భోగాపురం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడుగా కర్రోతు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకుడు నజీర్ ఆధ్వర్యంలో భోగాపురం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు, పార్టీ అనుబంధ కమిటీ సభ్యుల ఎన్నిక జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కర్రోతు సత్యనారాయణ ను మండల పార్టీ అధ్యక్షుడుగా, మార్కెఫెడ్ చైర్మన్ బంగార్రాజు ప్రతిపాదించగా మండల టిడిపి నాయకులందరూ బలపరిచారు. సంపూర్ణ మద్దతు లభించడంతో పాటు వేరే ప్రతిపాదనలు లేనందున పార్టీ అధ్యక్షలు గా కర్రోతు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పరిశీలకుడు నజీర్ ప్రకటించారు. అలాగే మండల తెలుగు యువత అధ్యక్షుడుగా మౌళి వర్మను నియమించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు పార్టీ కుటుంబ సభ్యులు అందరికి కృతఙ్ఞతలు తెలిపారు . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం కార్యకర్తలంతా సైనికుల పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ కి ప్రాణం పెట్టె కార్యకర్తలు ఎందరో ఉన్నారని వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు