Saturday, April 19, 2025
Homeజిల్లాలునెల్లూరుమండలవిద్యాశాఖ అధికారిగా కత్తి రవికుమార్

మండలవిద్యాశాఖ అధికారిగా కత్తి రవికుమార్

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండల నూతన విద్యాశాఖ అధికారిగా కత్తి రవి కుమార్ శుక్రవారం నూతనం గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మరియు సిబ్బంది శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో సమన్వయము చేసుకొని పరిష్కరిస్తామని, మండలంలో ఉన్న యూనియన్ నాయకులకు తెలియజేయడం జరిగినది. నూతన విద్యా విధానం లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి విద్యా శాఖ అభివృద్ధి చెందేలా చూస్తామని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మాదవరావు,కమల్ కుమార్,ఉపాధ్యాయులు,మండల కార్యాలయం సిబ్బంది మరియు మండల విద్యాశాఖ అధికారి 2, తెలుగుదేశం మండలపార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు