సీపీఐ నగర సమితి..
విశాలాంధ్ర -అనంతపురం : సీపీఐ నాయకుడు రామకృష్ణ పై ఒక ఎమ్మెల్యే అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, అనంతపురం సీపీఐ కార్యాలయంలో గురువారం సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు సహాయ కార్యదర్శి రమణ ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ… అనంతపురం నగరం నుంచి ఎన్నో సంవత్సరాలుగా పలువురు ఎమ్మెల్యేలుగా పనిచేసి, నగర అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ముఖ్యంగా సిపిఐ నాయకత్వంలో రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలమంది పేదలకు గృహ స్థలాలు, పట్టాలు అందించిన చరిత్ర ఉందన్నారు. గత 15 నెలల కాలంలో ప్రస్తుత ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ, వారి అనుచరులు రౌడిజం, దౌర్జన్యాలు, భూకబ్జాలు, చికెన్ షాప్ నుంచి వైన్ షాప్ వరకు అక్రమ దందాలు కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వారి మాన ప్రాణాలను కాపాడాలని.మీకు ఓటలు వేసి గెలిపిస్తే వారి ఆస్తులు కాపాడాల్సింది పోయి కంచే చేను మేసినట్టుగా ప్రజల ఆస్తిని కొల్లగొట్టే విధానాన్ని మీరు మార్చుకోవాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా, కొంతమంది ‘చెంచాగాళ్లు’ సీపీఐ చరిత్రను కించపరిచేలా, నాయకులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనీ. సిపిఐ పోరాటాలు చూస్తూ. దౌర్జన్యపరులకు రౌడీయిజానికి భూకబ్జాలకు కమ్యునిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు అన్నారు . కొంత మంది చిల్లర డబ్బులకు రాజకీయ చమచాలు అవుతూ సీపీఐ నాయకులను దూషించడం నువ్వా పార్టీ నాయకత్వానికి విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. దగ్గుపాట్టి వెంకట్ ప్రసాద్ చేత దౌర్జన్యానికి గురైన ప్రజలకు సిపిఐ అండగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మీ అవినీతి, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు. జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి లేదా ఇన్ఛార్జ్ మంత్రులు వస్తే, మీ దౌర్జన్యాలపై నిలదీస్తామని అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యానికి గురైన బాధితులకు అనంతపురం సీపీఐ అండగా నిలుస్తుందన్నారు . దౌర్జన్యకారులపై ప్రత్యక్ష పోరాటానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఇకముందు అక్రమాలు, కొనసాగితే సీపీఐ సహించదని ప్రజా శేత్రం లో తెలిచుకొందామని హెచ్చరించారు . ఈ సమావేశంలో మురళి కృష్ణ, అల్లి పీరా, చాంద్ భాష, మున్నాఫ్ఫ్ శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు..
ఖబర్దార్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపట్టి వెంకట్ ప్రసాద్…
- Advertisement -


