Sunday, April 12, 2026
Homeజిల్లాలువిజయనగరంఆధునిక సాంకేతికత తో లాభదాయక వ్యవసాయం..

ఆధునిక సాంకేతికత తో లాభదాయక వ్యవసాయం..

- Advertisement -

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

విశాలాంధ్ర-భోగాపురం: ( విజయనగరం) వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం వలన వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి అన్నారు.భోగాపురం గ్రామంలో యంత్రాల సాయంతో వరి నాట్లు వేసే యాంత్రీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా రైతు కష్టం తగ్గి, సమయం ఆదా అవుతూ, పంట దిగుబడి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రైతులు కొత్త సాంకేతిక పద్ధతులను స్వీకరిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. పాడీ ట్రాన్స్‌ప్లాంటర్ వంటి యంత్రాలు నాట్లను సమానంగా, వేగంగా నాటడంతో కూలీల ఖర్చు తగ్గి, పంట నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు