విశాలాంద్ర,పార్వతీపురం : జిల్లాలోని సీతానగరం మండలంలోని ఏగోటివలస గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంపై శ్రామికులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారంనిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు సామాజికతనికి డైరెక్టర్ జి శ్రీకాంత్ పర్యవేక్షణలో సామాజిక తనిఖీ బృందం ఈకార్యక్రమంను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కురిటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈపథకాన్ని అందరూ ఉపయోగించుకొని జీవనోపాధిని మెరుగు పరుచు కావాలని తెలిపారు. ఈపథకము ద్వారా చేసేపనులు గ్రామానికి చాలా ఉపయోగ కరంగ ఉన్నాయని తెలిపారు. ఎస్ ఆర్ పి దాసు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ (ఐఇసి) టీంద్వారా గ్రామంలో ఉండే ఉపాధిశ్రామికులకు ఉపాధి హామీ పథకంలోని హక్కులు, సౌకర్యాలు, రాజీలేని అంశాలుపై పూర్తి అవగాహన కల్పించారు. వేతనరేటు (307 రూ.) ఉపాధిలో కల్పిస్తున్న 94 రకాల పనుల గురించి వివరించారు.పథకంలోని పనులను చాటిచెప్పేందుకు గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇప్పటివరకు చేసిన పనులను, ఇంకా భవిష్యత్ లో చేయవలసిన పనులు వివరాలను గ్రామపటంవేసి పి ఆర్ ఏ మ్యాప్ ద్వారా ప్రజలకు వివరాలు వెల్లడించారు అనంతరము గ్రామసభ పెట్టి గ్రామసభలో ప్రజలతో ప్రత్యక్ష సంబాషణ జరిపి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపినాయకులు రాంబాబు,చిన్నారావు, సెక్రెటరీ, ఉపాధి హామీ పథకం ఏపిఓ బాలకృష్ణ, సిబ్బంది, సోషల్ ఆడిట్ సిబ్బంది శ్రీను, సురేష్, రమేశ్ తదితరులు
ఏగోటివలసలో ఉపాధిహామీ అవగాహన కార్యక్రమం
- Advertisement -
RELATED ARTICLES


