Homeతెలంగాణఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్.. కుమారస్వామితో కీలక భేటీ

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్.. కుమారస్వామితో కీలక భేటీ

- Advertisement -

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి బయలుదేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ఈ బృందం కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (్పు్పుI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరనుంది. ఈ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేయనున్నారు. బృందంలో కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు.కుమారస్వామితో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని బీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని బీఆర్‌ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల పునరుద్ధరణకు కీలకమవుతుందని బీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు