Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్కర్పూరం లా... కరిగిపోతున్న కొండలు..

కర్పూరం లా… కరిగిపోతున్న కొండలు..

- Advertisement -

కనుమరుగవుతున్న సహజ వనరులు,…

విశాలాంధ్ర: చిలమత్తూర్…. మండల పరిధిలో దేమకైతేపల్లి పంచాయతీ పరిధిలో కర్పూరంలా కొండలు కరిగిపోతున్నాయి.. కొంతమంది బడాబాబులు నామమాత్రపు లైసెన్సులతో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో కొండలను పగలగొట్టి కంకర తయారు చేసి వేల టన్నులు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు. కొండలను పగలగొట్టాలంటే మైన్స్ అండ్ జువాలజీ అధికారులతో తప్పనిసరిగా అనుమతులు ఉండాలి, అయితే నామమాత్రపు అనుమతులు తీసుకొని సహజ వనరులైన కొండలను పగలగొట్టి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు, సహజ వనరులైన కొండలను భారీ యంత్రాలతో పగలగొట్టినప్పుడు వచ్చే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యంతో ఆ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పశువుల కాపర్లు వాపోయారు, గ్రామాల్లో గృహాలు బీటలు బారుతున్నాయని , వాయు కాలుష్యంతో మల్బరీ తదితర పంటలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు, శబ్ద,వాయు కాలుష్యంతో పశువులు గడ్డి మేయలేక ఆ కొండలలోకి వెళ్లలేక నరకయాతన చవిచూస్తూన్నమన్నారు, ఇటీవల కాలంలో మరొక బడా బాబు యజ్ఞ శెట్టిపల్లి సమీపంలో భూమిని కొనుగోలు చేసి అందులో ఉన్న పెద్ద కొండలను పగలగొట్టాలని ఉద్దేశంతో రహదారి వేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది, ఈ విషయంపై పలువురు అడ్డు చెబుతున్న అధికారులు మాత్రం చూసి చూడునట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం, ముఖ్యంగా అడవి ప్రాంత సమీపంలోని వీరాపురం సైబీరియన్ పక్షులు కొండలను పిండి చేస్తున్న ప్రాంతంలో కనపించడం కష్టమే.., ఈ తతంగం ఇలాగే కొనసాగితే ఆ వలస పక్షులు ఈ ప్రాంతాలకు వలస రాకుండా కనుమరుగయ్య అవకాశాలు ఉన్నాయి, కావున సహజ వనరులు కర్పూరం లా కరుగుతుండడంతో మానవ జీవనానికి పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి సహజ వనరులు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు