ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు
విశాలాంధ్ర – ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ద్వారకాతిరుమల ఎలక్ట్రికల్ ఏఈ ఘంటా సోమేశ్వరరావు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ ఎన్. రాజేంద్ర ప్రసాద్, గృహనిర్మాణ శాఖ ఏఈ కె. వెంకటేశ్వరరావు, మైనర్ ఇరిగేషన్ ఏఈఈ సతీష్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అందుగుల ప్రవీణ్ కుమార్, జి శిరీషను ఘనంగా సత్కరించారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లైన్స్ క్లబ్ అధ్యక్షులు మొగతడకల లక్ష్మీరమణి ముఖ్య అతిథిగా హాజరై వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తూంపాటి సత్యనారాయణ, మొగతలకు శ్రీనివాసరావు,ఇమ్మడి శ్రీనివాసరావు, ఒంటిపల్లి ప్రసాద్, పాకనాటి శేషుబాబు, హరే రామకృష్ణ, పులపా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


