Friday, January 16, 2026
Homeజాతీయంప్రేమికులను కాడెద్దులుగా కట్టి…

ప్రేమికులను కాడెద్దులుగా కట్టి…

- Advertisement -

పెళ్లి చేసుకున్నందుకు శిక్ష… ఒడిశాలో అమానుష ఘటన

భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు శిక్షగా ఒడిశాలోని రాయగడ జిల్లాకు చెందిన ఒక యువ జంటను ఎద్దుల మాదిరిగా కాడికి కట్టి… పొలం దున్నమని బలవంతం చేసినట్లు ఒక వీడియో బయటపడిరది. స్థానిక సామాజిక నిబంధనలను ఉల్లంఘించి ఈ జంట వివాహం చేసుకున్నందుకు కొంతమంది గ్రామస్తులు అసంతృప్తి చెందారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయబడిన ఈ వీడియోలో వారిని కాడికి కట్టి నాగలి లాగుతున్నట్లు ఉంది. నివేదికల ప్రకారం, రాయగడ జిల్లాలోని కంజామరిaరా గ్రామానికి చెందిన ఆ యువకుడు, యువతి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ యువకుడు ఆ మహిళ అత్త కుమారుడు అయినందున కొంతమంది గ్రామస్తులు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్థానిక ఆచారాల ప్రకారం అలాంటి వివాహం నిషిద్ధంగా పరిగణిస్తారు. ఆ జంటను శిక్షించడానికి వందలాది మంది గ్రామస్తుల ముందు ఒక గుంపు…. వారిని ఎద్దుల మాదిరిగానే… వెదురు, చెక్క దుంగలతో తయారు చేసిన కాడికి కట్టి పొలం దున్నమని బలవంతం చేశారు. ఇద్దరు పురుషులు… ఆ యువకుడిని, యువతిని కర్రతో కొట్టినట్లు వీడియోలో ఉంది. ఈ బహిరంగ అవమానం తర్వాత ఆ జంటను గ్రామ దేవాలయానికి తీసుకువెళ్లి… వారు చేసిన పాపాన్ని ‘శుభ్రం’ చేయడానికి శుద్ధి కర్మలు చేయించారు. ఇదిలాఉండగా దర్యాప్తు చేయడానికి ఒక బృందం గ్రామాన్ని సందర్శించిందని, త్వరలో కేసు నమోదు చేస్తామని పోలీసు సూపరింటెండెంట్‌ ఎస్‌.స్వాతి కుమార్‌ శుక్రవారం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు