Friday, April 11, 2025
Homeజిల్లాలుఅనంతపురంమహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి

మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి

మంత్రి పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -అనంతపురం : మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక డ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి వేడుకల సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, మడకశిర ఎమ్మెల్యే మరియు టిటిడి సభ్యులు ఎంఎస్.రాజు, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… నేడు మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందన్నారు. మహారాష్ట్రలో జన్మించినా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే నన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, బలహీన, వెనుకబడిన వర్గాలు, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం పనిచేసిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. అసామాన్యుడిగా జన్మించినా సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి అన్నారు. ఆనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే అని, తన రచనలలో పూలేని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆనాటి పరిస్థితుల్లో వర్ణ వివక్ష, కుల వివక్ష ఉన్నటువంటి రోజుల్లో వాటికి వ్యతిరేకంగా నిలిచి, బాల్య వివాహాలను, వితంతు వివాహాల వంటి సామాజిక రుగ్మతల పట్ల చైతన్యం చేసినటువంటి వ్యక్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా పరిషత్ సీఈవో రామచంద్ర రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, డిటిడబ్ల్యువో రామాంజనేయులు, బిసి కార్పొరేషన్ డిడి సుబ్రమణ్యం, ప్రజా ప్రతినిధులు, వెనుకబడిన తరగతుల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు