Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

ఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

- Advertisement -

ఏఐఎస్బి కార్యదర్శి పోతులయ్య

విశాలాంధ్ర ధర్మవరం; మే నెల 17, 18, 19 వ తేదీలలో తణుకులో నిర్వహించే ఏఐఎస్బి రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలు పెంచాలని తెలిపారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి ఉన్నత విద్యను కాపాడాలని తెలిపారు. సోషలిజం, శాంతి, అభ్యుదయ లక్ష్యాలతో వెనీ 951 జూన్ 25న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినదే ఈ ఏఐఎస్బి అని తెలిపారు. ఈ విద్య శిక్షణా తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థి సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా మంజూరైన 17 మెడికల్ కళాశాలలను పిపిపి కింద నిర్వహించాలని ప్రభుత్వ క్యాబినెట్ చేసిన తీర్మానం వైద్య విద్యను అభ్యసించాలని ఆశపడుతున్న పేద వెనుకబడిన విద్యార్థులపై పిడుగు పడినట్లేనని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, బీసీ వసతి గృహ విద్యార్థులు సమస్యలతో జీవిస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 50 శాతం హాస్టళ్లు అద్దె భవనాలలో కొనసాగుతున్నడం వలన విద్యార్థులకు కనీస మౌలిక వసతులు తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేని దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రములో నెలకొన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగదీష్, బాలు, చిన్న, శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు. కావున విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు