మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్లప్ప గారి గంగాధర్
విశాలాంధ్ర అనంతపురం: ఈ నెల( నవంబర్ )16 వ తేదీన అనంతపురం పట్టణంలో
లలిత కళ పరిషత్ నందు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఉమ్మడి జిల్లాల మాదిగ ల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్లప్ప గారి గంగాధర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీ లలో ఉన్న59 కులాలకు సమన్యాయం జరగాలని గత 30 సంవత్సరాలుగా అనేక రకాల ఉద్యమాల ద్వారా నిబద్ధత ,నిజాయితీతో శ్రీ మంద కృష్ణ మాదిగ పోరాటం చేయడం వల్ల ఇటీవల ఆగస్టు ఒకటో తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అక్కడి పరిస్థితులు డిమాండ్ ను బట్టి సామాజిక న్యాయం దృక్పథంతో ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తీర్పు వచ్చిన సందర్భంగా మొదటిసారిగా మాన్య మందకృష్ణ మాదిగ అనంతపురం ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్నారన్నారు. ఆత్మీయ సమ్మేళన సదస్సుకు తరలివచ్చి మాదిగల ఐకమత్యాన్ని , చైతన్యాన్ని సమాజానికి చాటాలని కోరారు.
మందకృష్ణ మాదిగ ఆత్మీయ సభను విజయవంతం చేయండి
RELATED ARTICLES