- వెలుగు సిబ్బంది, గోవాడ బ్యాంకు అధికారులు కుమ్మక్కై స్వాహా చేశారని ఆరోపణలు ...
- చోడవరం పోలీసులకు ఫిర్యాదు
విశాలాంద్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : తే. 13.11.2024 ది. మండలములోని సింహాద్రిపురం, సబ్బవరపు వారి కల్లాలు, తదితర గ్రామాల్లో డ్వాక్రా మహిళా సభ్యులను మోసగించి వెలుగు వి ఓ ఏ వరలక్ష్మి , సీసీ తాతబాబు బ్యాంక్ అధికారుల సహాయంతో సుమారు రూ 30 లక్షలు వరకు స్వాహా చేశారు. డ్వాక్రా సిఎ, సీసీ గోవాడ బ్యాంకు అధికారుల సహకారంతో స్వాహా చేశారని పలు డ్వాక్రా సంఘాల సభ్యులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సంఘాలు రుణాలు పక్క దారి, మరి కొందరు సభ్యులకు తెలియకుండానే రుణాలు తో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆ డ్వాక్రా సంఘాల నాయకులు హెచ్చరించారు. భార్య డబ్బులు భర్తకు కూడా ఇవ్వని బ్యాంకు సిబ్బంది డ్వాక్రా మహిళల సొమ్ము వారు లేకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆ డ్వాక్రా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ చేపడుతున్న అనకాపల్లి డివో, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.