హడలెత్తుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు
పోలవరం: గత నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తోన్న పెద్ద పులి… మళ్లీ దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ … పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి…ఇప్ప్పుడు గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. గతంలో పులిని బంధించినపుడు…పులి మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పులి ఎక్కడుందనే కచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు.
పోలవరం జిల్లాలోని వేములోవ, పిడతమామిడి, రాములుదేవపురం, వడ్డిచెరువు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్దపులి దాడి చేసిందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని డీఎఫఓ సూచించారు. పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని… వీలైనంత త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు. దట్టమైన అడవి కావడం వల్ల పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
పులి సంచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిచారు. ప్రజలు, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతకతతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లా చికిలింత పంచాయతీలో పులి దాడిలో 9 దూడలు మృతి చెందటం పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ పశువులు, మనుషులకు ఎలాంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, 24గంటలూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
మళ్లీ ‘పులి’ సంచారం
- Advertisement -
RELATED ARTICLES


