Homeతెలంగాణహైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌లో ట్విస్ట్‌.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే...

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌లో ట్విస్ట్‌.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే…

- Advertisement -

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు)కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ఈ కారిడార్‌ను శంషాబాద్‌ నుంచి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించారు. అయితే తాజా సర్వేలో మార్గాన్ని మార్చి శంషాబాద్‌ నుంచి భారత్‌ సిటీ, డ్రైపోర్ట్‌, హాలియా, వాడపల్లి మీదుగా ప్రతిపాదించారు.
ప్రస్తుతం ఈ కొత్త ఎలైన్‌మెంట్‌కు సంబంధించిన సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ తెలంగాణలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తమిళనాడులో ముగిసేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ప్రతిపాదించిన మార్గం ప్రకారం తెలంగాణ పరిధిలో ఈ ప్రాజెక్టు పొడవు 236 కిలోమీటర్లు ఉండగా, దీనికి 790 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించారు.
అయితే కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం తెలంగాణలో ప్రాజెక్టు దూరం 123 కిలోమీటర్లకు పరిమితం కానుంది.
ఈ విషయాన్ని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (చీHS్పు=L) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

శంషాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులో తెలంగాణలో నాలుగు స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారత్‌ సిటీ, డ్రైపోర్ట్‌, హాలియా, వాడపల్లి ప్రాంతాల్లో బుల్లెట్‌ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ సంస్థ పేర్కొంది. ఇవాటిలో డ్రైపోర్ట్‌, హాలియా, వాడపల్లి స్టేషన్లు నల్గొండ జిల్లా పరిధిలోనే ఉండనున్నాయి. కాగా, భారత్‌ సిటీ-వాడపల్లి మార్గంలోనే చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే కోరిన నేపథ్యంలో ఈ కొత్త ఎలైన్‌మెంట్‌పై సర్వే చేపట్టినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టులో డ్రైపోర్ట్‌ స్టేషన్‌ ప్రతిపాదన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో సరకు రవాణాను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హైస్పీడ్‌ రైలు స్టేషన్‌ను కూడా ప్రతిపాదించారు. డ్రైపోర్ట్‌లో సముద్ర తీరంలోని పోర్టుల నుంచి వచ్చే ఎగుమతి, దిగుమతి సరుకుల నిల్వ, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, లోడింగ్‌ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతుల రవాణా మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రణాళికలపై దృష్టి సారిస్తోంది.

ప్రతిపాదిత స్టేషన్ల సమీప ప్రాంతాలు
నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రతిపాదిత స్టేషన్లకు సమీపంలోని రహదారులు, ప్రాంతాల వివరాలను కూడా పేర్కొంది. డ్రైపోర్ట్‌ స్టేషన్‌:లిలి జాతీయ రహదారి-19కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీపంలోని ప్రధాన ప్రాంతం మాల్‌ (15 కి.మీ.).
హాలియా స్టేషన్‌: స్టేట్‌ హైవే-167కు సమీపంలో ఉంటుంది. హాలియా మండల కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. సమీప రైల్వే స్టేషన్‌ మిర్యాలగూడ 35 కిలోమీటర్లు, నల్గొండ 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాడపల్లి స్టేషన్‌: స్టేట్‌ హైవే-167కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హాలియాకు 33 కిలోమీటర్లు, మిర్యాలగూడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు