Homeతెలంగాణతెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

- Advertisement -

తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
మరోవైపు, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగాల్పులు, ఈదురుగాలులు, ఉరుములు-మెరుపుల నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు