విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల గోడపత్రికను బుధవారం స్థానిక గ్రంథాలయంలో మండల విద్యాశాఖ అధికారులు ఈశ్వరప్ప, రమాదేవి, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమా ఆదేశాలతో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్స వాల్లో భాగంగా ప్రారంభం రోజున మొదలుకుని బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, విద్యార్థినీ, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మే ళనం, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్కరణ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. చివరి రోజు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వారోత్స వాల్లో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
RELATED ARTICLES