సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్
విశాలాంధ్ర -శింగనమల : నార్పల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 6వ మండలమహసభలుసీపీఐ మండలకార్యదర్శి గంగాధరఅద్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్సన్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి,శింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, ఏపీరైతుసంఘం జిల్లాఅద్యక్షులు డి.చిన్నప్పయాదవ్ లు హజరయ్యారు. ఈ సంధర్బంగా సీపీఐ జిల్లాకార్యదర్శి సి.జాఫర్ మాట్లాడుతూ,అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని, సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేసి, అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని, సూపర్ సిక్స్ హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, జూన్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, నగర ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి పట్టాలు ఇస్తూ ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని ఇసుక, ఇనుము, సిమెంటు ధరలు పెరగడం వలన ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్నారు. గ్రామ సచివాలయాల వద్ద, ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దశలవారీగా ఉద్యమం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఇంటి స్థలాల పంపిణీ చేయడానికి అంగీకారం తెలిపిందని, ఇంతవరకు ఇచ్చిన దరఖాస్తులను విచారణ చేయలేదన్నారు. తక్షణమే ఇంటి స్థలాల దరఖాస్తులు చేసుకున్న వారికి సర్వే చేయాలని అర్హుల జాబితాను ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని, అప్పట్లో ఇంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. టిడ్కో ఇంటికి సంబంధించి 80 శాతం పూర్తి అయిందని ప్రభుత్వం సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. టిడ్కో ఇంటి కోసం 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయడం జరిగిందని, బ్యాంకు నుంచి ఈఎంఐ కట్టాలని ఒత్తిడి వస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు సంవత్సరం గడుస్తున్న అమలు కాలేదని, పింఛన్ రూ. 4000 ఇస్తూ చాలామందికి కోత పెడుతున్నారన్నారు. సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు కానీ ఒక్క సిలిండర్ కు మాత్రమే సబ్సిడీ వస్తుందన్నారు. తల్లికి వందనం, ప్రతి మహిళకు నెలకు 1,500 ప్రతి మహిళకు ఉచిత బస్సు సర్వీస్ ఇంతవరకు అమలు కాలేదన్నారు. రైతు సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామన్నారే కానీ ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు . ఈ విషయాలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి జూన్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అనంత జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐపుట్లూరుమండలకార్యదర్శి,పెద్దయ్య,శింగనమలమండల కార్యదర్శి,మధుయాదవ్, నార్పల మండలసహయకార్యదర్శులు చాపలరామాంజి,సుధాకర్ లలితమ్మ,పెదపెద్దయ్య,నాగరాజు,పెద్దక్క,ఉమాపతి,యంగప్ప,చంద్ర,అల్తాప్ ,అంజినేయులు,రమేష్ ,రాజు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.