Homeజాతీయంఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయి

ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయి

- Advertisement -

ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలపై .. మల్లికార్జున ఖర్గే చురక
బీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గే

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మంచినీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస్తే నిర్లక్ష్యం వహించకూడదని జాగ్రత్తలు చెప్పారు. మోదీ జాగ్రత్తలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేరని అన్నారు.

దేశ ప్రజలకు అధిక ఉష్ణోగ్రతల కంటే, ద్రవ్యోల్బణం కారణంగానే చెమటలు పడుతున్నాయని చురక అంటించారు. ప్రజలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దోచుకుంటోందని, కానీ దీనిపై ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. మేం ఎండవేడిని తట్టుకోగలం. కానీ బీజేపీ ప్రాయోజిత ద్రవ్యోల్బణం అనే మంటల వల్ల సామాన్య ప్రజలకు చెమటలు పడుతున్నాయి. మీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ గురించి మీరెందుకు మాట్లాడటం లేదు మోదీజీ? అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు