Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కిందపడి వ్యక్తి మృతి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కదిరి రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (20-30 సంవత్సరాలు వయసు) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకొని కదిరి గేట్ సమీపంలో గల గుజిరి షాపులో వేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇదే తీరిలో రైల్వే పట్టాల పక్కన ఓ చెట్టు కింద కూర్చొని, రైలు వస్తుండగా క్షణాల్లో రైలుకు అడ్డం పోగా అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరైనా తెలిసి ఉంటే సెల్ నెంబర్ 89 78656463 కు గాని 9951325345కు సంప్రదించాలని తెలిపారు. తదుపరి ధర్మవరం జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు