రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువు గ్రామమునకు పోయే దారిలో దేవరకొండ రాజు (31 సంవత్సరాలు) అనుమాన స్వధ రీతిలో మృతి చెందాడని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు దేవరకొండ రాజు కియా కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడని తెలిపారు. మృతునికి బంధువులు కేతిరెడ్డి కాలనీలో ఉన్నారని, ఆ కాలనీకి చెందిన చరణ్ కుమార్ అనే అతను ఆదివారం బైకులో కాలనీకి తీసుకువెళ్లాడని, అనంతరం గ్రామ సమీపానగల రోడ్డు భాగాన చనిపోయి ఉన్నాడని తెలిపారు. అసలు ఇది ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య మన్వితతో పాటు ఒక సంవత్సరం వయసు గల కూతురు తోపాటు భార్య గర్భిణీగా కూడా కలదని తెలిపారు. తరచూ కేతిరెడ్డి కాలనీకి చెందిన చరణ్ కుమార్ కేతిరెడ్డి కాలనీకి తీసుకొని వెళ్లే వాడని తెలిపారు. తండ్రి రత్నమయ్య తన కుమారుడు మృతికి చరణ్ కుమార్ ఏ కారణం అని తెలుపుతూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇది హత్యనా..? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఈ కేసు జదిస్తామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సవ పరీక్ష అనంతరం, బాడీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి
- Advertisement -
RELATED ARTICLES


