Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలో ఏఐఎస్‌ఎఫ్ భారీ ధర్నా

తిరుపతిలో ఏఐఎస్‌ఎఫ్ భారీ ధర్నా

- Advertisement -
  • ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • హాస్టళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, జి.ఓ. 77 రద్దు, మెస్ చార్జీల పెంపు కోరుతూ కలెక్టరేట్ ముట్టడి
  • సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉధృతం..
  • ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు హెచ్చరిక

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచాలని, జి.ఓ. నెం. 77ను రద్దు చేయాలని, నాడు-నేడు కార్యక్రమంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు, తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు మాట్లాడుతూ., రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జీవోలు 107, 108 రద్దు చేస్తామని ఎన్నికల ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినా, ఇప్పటికీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ ఉన్నత విద్యను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు నిధులు ఆలస్యం చేయడం అన్యాయమని అన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏఐఎస్‌ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ., రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విడతల వారీగా నిధులు విడుదల చేయడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం లేదని, బకాయిలన్నింటినీ ఒకేసారి చెల్లించాలని కోరారు. పీజీ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో నెం.77ను తక్షణమే రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఫీజులు చెల్లించలేక, కళాశాలల నుంచి సర్టిఫికెట్లు పొందలేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని కోరారు. ఉపాధి కల్పన విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు చిన్నా మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యార్థులకు బకాయిలు అందలేదని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి మాట్లాడుతూ., రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన ఆయన, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి, అధ్యక్షులు హరిక్రిష్ణ, వినయ్, ఎస్వియు అధ్యక్షులు రవి, నాయకులు అశోక్, సురేష్, తారక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు