Friday, June 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంమెడికల్ కళాశాల శానిటేషన్ వర్కర్ల బకాయి వేతనాలు చెల్లించాలి

మెడికల్ కళాశాల శానిటేషన్ వర్కర్ల బకాయి వేతనాలు చెల్లించాలి

ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి

విశాలాంధ్ర- అనంతపురం : మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు 3 నెలలు బకాయి ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో పనులు నిలుపుదల చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు నెలల తరబడి వేతనాలు వేయకపోతే వారి కుటుంబం ఏ విధంగా బతకాలన్నారు,చాలీ చాలని వేతనాలతో బతుకీడుస్తుంటే నెలల తరబడి వేతనాలు రాకపోయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వేతనం వేసిన తరువాత మెడికల్ కాలేజీలో 10 రోజులైన వేతనాలు వేయడం లేదన్నారు. అనేక మార్లు అధికారులు,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకుపోయినా పలితం లేదన్నారు. ఈపీఎఫ్ సొమ్ము కట్టాల్సిన దాని కంటే చాలా తక్కువ కడుతున్నారన్నారు. ఈపీఎఫ్ లో జరిగిన అవకతవకల్లో కాంట్రాక్టర్,అధికారులు పాత్ర ఉందని ఆరోపించారు. ఈ ఎస్ ఐ సమస్యలు ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బకాయి ఉన్న వేతనాలు వెంటనే వేయాలని లేని పక్షంలో ఆందోళనలు కొనసాగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,మెడికల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్,నాయకులు శోభా,ప్రశాంత్,పామీదా,లక్ష్మిదేవి,నారప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు