Sunday, June 15, 2025
Homeజిల్లాలునెల్లూరురోళ్లపాడులో ఉపాధిహామీ పనుల ఆకస్మిక తనిఖీ

రోళ్లపాడులో ఉపాధిహామీ పనుల ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర వలేటివారిపాలెం : జాతీయగ్రామీణ ఉపాధిహామీపథకంలో భాగంగా వలేటివారిపాలెం మండలంలోని లింగపాలెం పంచాయతీలోని రోళ్లపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఏపీఓ దయాసాగర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పనిప్రదేశంలో పని చేస్తున్న కూళీల హాజరు పట్టికను పరిశీలించారు.పనులు జరుగుతున్న తీరును గురించి కూళీలను అడిగి తెలుసుకొని కూళీలకు తగు చూచనలు చేశారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటలకు పనికి వచ్చి 10 గంటలకు పని ముగించుకొని పోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేచించిన కొలతలు ప్రకారం పనులు చేసుకొని ప్రభుత్వం నిర్ణహించిన కూళి పొందాలని అన్నారు. ఉపాధిహామీ పనులు నాణ్యతగా ఉండాలని అన్నారు. పనుల విషయంలో రాజీ పడవద్దని చూచించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని, పని ప్రదేశంలో నీడ, మంచినీటి వసతి కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు