విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం నుంచి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జరిగిన చర్చల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక అంశాలు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు, ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించారు.


